అవుకు మండలంలో రోడ్లపై మొక్కజొన్న వ్యర్ధాలు,ఇబ్బందుల్లో వాహనదారులు
రోడ్లపై మొక్క జొన్న వ్యర్థాలు వాహన దారులకు ప్రాణసంకటంగా మారింది. నంద్యాల జిల్లా అవుకు-కోవెలకుంట్ల రహదారిలో రైతులకు నిర్లక్ష్యంగా మొక్క జొన్న పంట వ్యర్థాలను రోడ్డుపై వదలడం, వరి ధాన్యం, జొన్న, మొక్కజొన్న పంటలను ఆరేయడానికి సమీపంలోని రోడ్లను కల్లాలుగా వాడుకుంటున్నారు. వాహనదారులు రోడ్డుపై ఉన్న కుప్పలను గమనించక తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. అధికారులు రైతులకు అవగాహన కల్పించి వ్యర్థాలను తొలగించాలని కోరారు.