నంద్యాలలో స్థలం విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ ,ముగ్గురికి గాయాలు
Nandyal Urban, Nandyal | Dec 2, 2025
నంద్యాల కూరగాయల మార్కెట్లో భూమి సరిహద్దు సమస్యపై కలాం, ఉస్మాన్, అబూ బకర్పై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. కోర్టులో పెండింగ్లో ఉన్న స్థలం విషయంలో మంగళవారం ఉదయం గ్రూపులుగా ఏర్పడి బాధితుల కళ్లలో కారం కొట్టారు. పోలీసుల రాకతో ఘర్షణ సద్దుమణిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.