నంద్యాల జిల్లా నందికొట్కూరు నిన్నటి రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు వళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని లేకపోతే మీ పార్టీకి పుట్టగతులు ఉండవని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు ఆదివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మాజీమంత్రి అంబటి రాంబాబు ఖబడ్దార్ ,మా విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మమ్మల్నిక్రమశిక్షణతో ,ప్రజలతో కలిసి ఉండాలని చెప్పినందు వల్లనే మేమంతా ఓపికగా ఉన్నాము లేకపోతే మీ పరిస్థితి వేరేలా ఉండేది 2024 ఎన్నికలలో ప్రజలు ఛీ కొట్టినా,బుద్దిలేకుండా ప్రవర్తిస్తున్నారు.