నాగర్ కర్నూల్: ప్రజావాణి కి వచ్చే ఫిర్యాదులు త్వరగా పరిష్కరించేందుకు సిబ్బంది కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్
జిల్లాలో ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి పై ప్రజలు నమ్మకంతో ఎంతో దూరం నుంచి వస్తుంటారని వారి సమస్యలను విన్న వెంటనే సంబంధిత శాఖ అధికారులు స్పందించి పరిష్కారం చూపేలా ఉండాలని జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి 91 ఫిర్యాదులు వచ్చినట్టు తెలిపారు.