బ్రహ్మసముద్రం మండలం నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మాజీ జెడ్పీటీసీ గంగమ్మ ఆదివారం రాత్రి ఆకస్మికంగా మృతి చెందారు. గంగమ్మ మృతి పట్ల పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు సంతాపం ప్రకటించారు. పలువురు టీడీపీ నాయకులు నాగిరెడ్డిపల్లి గ్రామానికి వెళ్లి గంగమ్మ మృతదేహంపై పూలమాలవేసి నివాళులర్పించారు. మృతురాలు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.