శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలో శుక్రవారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో రోడ్డు దాటుతుండగా లేపాక్షి మండలం కొండూరు గ్రామానికి చెందిన చిన్న నరసింహప్పా అనే వ్యక్తిని కారు ఢీకొనడంతో తీవ్ర గాయాలవడంతో మెరుగైన చికిత్స కోసం హిందూపురం ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచనల మేరకు అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చిన్న నరసింహప్ప ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం మిషమంగానే ఉన్నదని అత్యవసర విభాగం వైద్యురాలు డాక్టర్ రీనా కుమారి తెలిపారు.