మందమర్రి: బీజేపీ జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన వెంకటేశ్వర్ గౌడ్
మంచిర్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షునిగా ఇటీవల ఎన్నికైన నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఐబి చౌరస్తాలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం స్థానిక సుచిత్ర ఇన్ హోటల్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని బాధ్యతలను చేపట్టారు. నూతనంగా బాధ్యతలను చేపట్టిన వెంకటేశ్వర్ గౌడ్ ను పలువురు నాయకులు కార్యకర్తలు ఘనంగా సన్మానించారు,