ఒంగోలు: ఈనెల29 నుంచి ఫిబ్రవరి 1వరకు విద్యుత్ టారీఫ్ లపై వినియోగదారుల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ,జిల్లా విద్యుత్ శాఖ SE సత్యనారాయణ,
ఈనెల 29 నుండి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు 2024 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విద్యుత్ టారిఫ్ లపై వినియోగదారుల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నట్లు విద్యుత్ శాఖ ఎస్ఈ కే వి జి సత్యనారాయణ తెలిపారు, ఈ సందర్భంగా శనివారం ఆయన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు టారీఫ్ ప్రతిపాదనలను ఏపీఈ ఆర్సీ వెబ్సైట్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు, జిల్లాలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ అభిప్రాయాలు తెలియజేయాలని కోరారు,