కొడంగల్: బొంరాస్ పేట్ మండల కేంద్రంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహణ
వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో గురువారం కడ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి, కోడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఎనుముల తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కడ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఎనుముల తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. పేద ప్రజల సంక్షేమం దృష్ట్యా అనేక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అందజేస్తుందని అన్నారు.