నగరంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పార్టీ శ్రేణులతోకలిసి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్
Anantapur Urban, Anantapur | Mar 29, 2026
సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ఆనాడు నందమూరి తారక రామారావు పార్టీని వ్యవస్థాపించారని టిడిపి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. ఆదివారం ఉదయం పది గంటల సమయంలో టిడిపి 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అనంతపురంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పార్టీ శ్రేణులతో కలిసి వారు పూలమాలవేసి నివాళులు అర్పించారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు గర్వించే స్థాయికి తెలుగుదేశం పార్టీని 9 నెలల కాలంలోనే అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావుకు దక్కుతుందన్నారు.