పెద్దవడుగూరు మండల పరిధిలోని అప్పేచెర్ల గ్రామ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి తర్వాత రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు లారీలు ఢీకొన్నాయి. ప్రమాదంలో తెలంగాణకు చెందిన లారీ డ్రైవర్ శంకరయ్య తీవ్రంగా గాయపడ్డాడు. గుత్తి వైపు నుంచి తాడిపత్రి వైపు వెళుతున్న లారీని మరో లారీ వెనకనుంచి ఢీకొంది. వెనక లారీ డ్రైవర్ శంకరయ్య తీవ్రంగా గాయపడ్డాడు. 108 అంబులెన్స్ సిబ్బంది రవి, ప్రేమ జ్యోతి ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లారీ డ్రైవర్ శంకరయ్యను గుత్తి ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.