పత్తికొండ: వెల్దుర్తి లో రైతులు పొలాల దొంగతనాలు పట్టుకొని దొంగను పోలీసులకు అప్పగించిన రైతులు
వెల్దుర్తిలోని రైతుల పొలాల్లో 12 డీజల్ మోటర్లు దొంగతనానికి గురయ్యాయి. దీంతో రైతులు నిఘా ఏర్పాటు చేయగా నార్లపురానికి చెందిన శ్రీనివాసులు అనే రైతు పొలంలో మోటార్ తీగలు కత్తిరిస్తున్న ఒక దొంగను రెడ్్యండెడ్గా రైతులు గురువారం పట్టుకున్నారు. మరో ఇద్దరు పరారయ్యారు. పట్టుకున్న వ్యక్తిని ఆటోతో సహా వెల్దుర్తి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.