అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఉన్న అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందుతూ పెనుగొండ సమీపంలో రైలులో నుంచి ప్రమాదవశాత్తు కింద పడిన శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాలోని మడకశిర నియోజకవర్గంఇచ్చి లేdu గ్రామానికి చెందిన ఎన్ గోపాల్ అనే యువకుడు మృతి చెందాడు. పెనుగొండ సమీపంలో ఆదివారం ఉదయం జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఆదివారం మధ్యాహ్నం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.