సంబేపల్లిలో ప్రైవేట్ వ్యక్తుల స్వాధీనంలో అక్రమంగా ఉన్న 18 ఎకరాల 80 సెంట్ల ప్రభుత్వ భూమిని ప్రభుత్వ పరం చేసుకున్నాం
సంబేపల్లిలో ప్రైవేటు వ్యక్తుల స్వాధీనం అక్రమంగా ఉన్న 18 ఎకరాల 80 సెంట్లు ప్రభుత్వ భూమిని ప్రభుత్వ పరం చేసుకున్నామని జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ.... 2024లో ప్రభుత్వ స్థలాలు ప్రైవేటు వ్యక్తుల స్వాధీనంలో ఉన్న అంశంపై సంబేపల్లి తాసిల్దార్ ఇచ్చిన నివేదిక పై... సంయుక్త కలెక్టర్ కోర్టులో సమగ్ర విచారణ చేపట్టామని పేర్కొన్నారు. సంబేపల్లిలో 18 ఎకరాల 80 సెంట్ల ప్రభుత్వ భూమి... గౌతమ్, శంకర్ నారాయణ రెడ్డి, శివగంగ, ఉదయ్ కుమార్ రెడ్డిల స్వాధీనంలో అక్రమంగా ఉంచుకున్నారని, వారికి ప్రభుత్వ స్థలాన్ని కేటాయించ