పాణ్యం: 96 చక్రాల ట్రైలర్‌పై 33 అడుగుల భారీ శివలింగం సోమయాజులపల్లిలో దర్శనం
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్ మండలం సోమయాజులపల్లి గ్రామం వద్ద శనివారం రోజున 96 చక్రాల వాహనంపై 33 అడుగుల ఎత్తైన భారీ శివలింగం దర్శనమిచ్చింది. మహాబలిపురంలో మూడు కోట్ల వ్యయంతో పది సంవత్సరాల పాటు తయారైన ఈ శివలింగం బీహార్‌లోని విరాట్ రామాయణ మందిరానికి తరలిస్తున్నారు. సుమారు 200 టన్నుల బరువున్న ఈ శివలింగాన్ని అక్కడ ప్రతిష్ఠించనున్నారు.