భూపాలపల్లి: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం : జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామ్ నగర్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న బస్తీ దవాఖాన పనులను అధికారులతో కలిసి గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు పరిశీలించారు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ. పనులు వెంటనే పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. ఈ క్రమంలో మాజీ కౌన్సిలర్ దాట్ల శ్రీనివాస్ నిధులు సరిపోకపోవడంతో పనులు ఆలస్యంగా కొనసాగుతున్నాయని, ఆసుపత్రి నిర్మాణానికి మరిన్ని నిధులు కేటాయించాలని కలెక్టర్ కు వినతి పత్రం అందించారు. స్పందించిన కలెక్టర్ రాహుల్ శర్మ త్వరలో మరిన్ని నిధులు మంజూరు చేసి ఆసుపత్రి నిర్మాణం జరిగేలాచూస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.