దామరచర్ల: డిసెంబర్ చివరి నాటికి వైటిపిఎస్ లో పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నాం: భట్టి విక్రమార్క
నల్గొండ జిల్లా, దామరచర్ల మండలం, వీర్లపాలెం వద్ద గల యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో స్టేజ్-1 లోని ఒకటవ యూనిట్ ను మంత్రులతో కలిసి ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రారంభించి, అనంతరం శుక్రవారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడుతూ.. డిసెంబర్ చివరి నాటికి అన్ని పనులను పూర్తి చేసి 2026 జనవరి 26 నుండి పూర్తిస్థాయిలో అన్ని యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అందుకుగాను అధికారులు నిర్దేశించిన క్యాలెండర్ ప్రకారం పనిచేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు 2 యూనిట్లను పూర్తిచేసిన అధికారులను ఉపముఖ్యమంత్రి అభినందించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలన్నారు