జాతీయస్థాయి రగ్బీ పోటీలకు నెహ్రు నగర్ జెడ్పి పాఠశాల విద్యార్థిని ఎంపిక
నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం నెహ్రూ నగర్ జడ్పీ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న పాలూరు జ్యోతి ప్రియ జాతీయస్థాయి రగ్బీ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల హెచ్ఎం పెద్ద నాగన్న మంగళవారం తెలిపారు, డిసెంబర్ 1,2 తేదీలో కృష్ణాజిల్లా గన్నవరం రాష్ట్రస్థాయి అండర్ 14 పోటీల్లో కర్నూలు జిల్లాకు బంగారు పతకం సాధించడంలో విద్యార్థిని పాలూరు జ్యోతి ప్రియ కీలకపాత్ర పోషించారు, ఒడిస్సా రాష్ట్రం భువనేశ్వరంలో వచ్చేనెల 8 9 10వ తేదీల్లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు, పాలూరు జ్యోతి ప్రియ పాఠశాలలోని ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు