అనంతపురం జిల్లాలో బంగారు వ్యాపారి ఇంటిలో జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించారు. కణేకల్లు పోలీసు స్టేషన్ పరిధిలో బంగారు వ్యాపారి లతీఫ్ ఇంటిలో రెండు రోజుల భారీ చోరీ జరిగింది. బాదితుల పిర్యాదుతో రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డాగ్ స్క్వాడ్? క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించారు. దర్యాప్తులో డాగ్ స్క్వాడ్ ద్వారా నిందితున్ని గుర్తించారు. కణేకల్లు క్రాస్ వద్ద నిందితుడు రజాక్ ను మంగళవారం అరెస్టు చేశారు. 10 తులాల బంగారు, కిలో వెండి నగలు రికవరీ చేశారు. వీటి విలువ సుమారు 12 లక్షలు ఉంటుందన్నారు.