శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తిలో సత్య సాయి విద్యా సంస్థలు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ప్రారంభించారు. మంగళవారం మధ్యాహ్నం పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు, పట్టణ ప్రజలు అక్కడికి వెళ్లి ఈ ఎగ్జిబిషన్ను తిలకించారు. అక్కడ నిర్వహించిన ఎగ్జిబిషన్లో వారు తయారు చేసిన వస్తువుల గురించి విద్యార్థులు వివరించారు. ముఖ్యంగా ఆధ్యాత్మికం చరిత్రాత్మకం గురించి పిల్లలు వివరించిన విధానాన్ని పలువురు అభినందించారు