ధర్మపురి: పట్టణంలోని నరసంహుడికి వెండి ఆభరణం అందజేసిన భక్తుడు, ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే లక్ష్మణ్, ఆలయ అధికారులు
జగిత్యాల జిల్లా ధర్మపురి ఉగ్ర నరసింహ స్వామివారికి వెండి వక్ష స్థలం ఆభరణాన్ని బుధవారం ఉదయం హైదరాబాద్ కు చెందిన పెంచాల భాస్కర్ రావు శిరీష దంపతులు స్వామివారికి సుమారు రూ.2 లక్షల 30 వేల విలువగల వెండి ఆభరణాన్ని అందజేశారు. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, ఆలయ చైర్మన్ రవీందర్ నేతృత్వంలో ప్రత్యేక పూజలు చేసి ఈవో శ్రీనివాస్ కు అందజేశారు. అనంతరం భక్తుడికి స్వామివారి శేష వస్త్రం ప్రసాదం అందజేశారు.