ప్రొద్దుటూరు: భర్త తన కంటి శ్రీనివాసులు ఆచూకీ తెలియడం లేదని భార్య శ్రీలక్ష్మి ఆవేదన
Proddatur, YSR | Nov 22, 2025 నా భర్తను కిడ్నాప్ చేసింది ఎవరు.. శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ప్రొద్దుటూరు పట్టణ నట్టి నడిరోడ్డున శివాలయం సెంటర్లో పోలీసులమని చెప్పి నా భర్తను కారులో తీసుకెళ్లారని అయితే నా భర్త కనిపించలేదని ప్రొద్దుటూరులోని అన్ని పోలీస్ స్టేషనులకు తిరిగానని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో రాత్రి ఫిర్యాదు కూడా చేసిన ఇప్పటివరకు కనీసం ఎత్తుకెళ్లింది ఎవరు అన్న విషయం పోలీసులు చెప్పకపోవడం దారుణమని ప్రొద్దుటూరు పట్టణం బంగారు దుకాణాల వీధిలో ఉన్న తనకంటి జువెలర్స్ యజమాని తనకంటి శ్రీనివాసులు భార్య శ్రీలక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది.