హోంగార్డుల సంక్షేమానికి కృషి చేస్తానని చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి అన్నారు. శనివారం పాత పోలీసు పరేడ్ మైదానంలో 63వ హోంగార్డ్ రైజింగ్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా ఎస్పీ తుషార్ డూడి హోంగార్డులను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర పోలీసు శాఖ అందిస్తున్న సంక్షేమ ఫలాలను ప్రతి ఒక్క హోమ్ గార్డ్ కి అందేలా చర్యలు చేపడతామన్నారు. వారి ఆరోగ్య ఆర్థిక సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. విధి నిర్వహణలో హోంగార్డులు చేస్తున్న సేవలను అభినందించారు. వారికి సేవా పథకాలను బహూకరించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాజశేఖర్, పోలీస్ అధికారులు, హోంగార్డ్ కుటుంబ