కొడంగల్: కడంపల్లి గ్రామ శివారులో అక్రమంగా నిర్వహించిన 100 ట్రాక్టర్ల ఇసుకను సీజ్ చేసిన తహసీల్దార్ బక్క శ్రీనివాసులు
నారాయణపేట జిల్లా కోస్గి మండలంలోని కడంపల్లి గ్రామ శివారులో అక్రమంగా నిలువ ఉంచిన 100 ట్రాక్టర్ల ఇసుకను శుక్రవారం స్థానిక తహసిల్దార్ బక్క శ్రీనివాసులు దాడులు నిర్వహించి సీజ్ చేశారు. సీజ్ చేసిన ఆర్టీవోసుకను అదే మండలంలోని చంద్రవంచ గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి తరలించినట్లు ఆయన తెలిపారు. అక్రమంగా ఎవరైనా ఇసుకను నిలువ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.