కూరపర్తి గ్రామ కోటలో అత్యంత వైభవంగా గణపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ట
శిథిలావస్థలో ఉన్న వాల్మీకిపురం మండలం కూరపర్తి కోటకు గ్రామస్తులు పునరుద్ధరణ పనులు చేపట్టి పూర్తి చేశారు. ఈ కోటలో గుడిని నిర్మించి గణపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమాలు చేపట్టారు. శనివారం ఉదయం నుంచి సుప్రభాతం, యంత్ర ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట, కలశపూజ, మహా సుదర్శన హోమం, ప్రాణ ప్రతిష్ట హోమములు, మహా పూర్ణాహుతి, కుంబాభిషేకం పంచామృతాభిషేకం, శ్రీ అలంకారం, మహా మంగళహారతి, తీర్థ ప్రసాదములు వితరణ కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు