మంత్రాలయం: కోసిగి బస్ స్టాండ్లో ఆదోని వెళ్లే బస్సులో సీటు కోసం ఇద్దరు మహిళల మధ్య గొడవ
కోసిగి : కోసిగి బస్ స్టాండ్లో ఆదోని వెళ్లే బస్సులో సీటు కోసం ఇద్దరు మహిళల మధ్య గొడవ జరిగింది. మంగళవారం తుంగభద్ర-కోసిగి మీదుగా ఆదోని వెళుతున్న బస్సులో ఈ సంఘటన చోటుచేసుకుంది.అగసనూరు గ్రామానికి చెందిన మహిళకు, కోసిగికి చెందిన మహిళకు మధ్య మొదట వాగ్వాదం జరిగింది. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి చేతలదాకా వెళ్లింది. చివరకు, డ్రైవర్, కండక్టర్లు ఇద్దరికీ సర్దిచెప్పి, బస్సును ముందుకు కదిలించినట్లు వారు తెలిపారు..