ఒంగోలు: ఫిబ్రవరి 15న నిర్వహించే సూర్య యజ్ఞం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్
ఫిబ్రవరి 15వ తేదీన రథసప్తమి సందర్భంగా నిర్వహించే సూర్య యజ్ఞం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో శనివారం పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ సూర్య నమస్కారం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు, భారత్ వరల్డ్ రికార్డు నమోదులో భాగంగా విద్యార్థులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.