నంద్యాల జిల్లా చాగలమర్రిలో పూర్వకాలం నుంచి పగటివేషాల సంప్రదాయం కొనసాగుతుంది, ప్రతి వీధిలో అర్ధనారీశ్వరుడు శ్రీకృష్ణుడు నారదుడు భీముడు ఆంజనేయ స్వామి సుప్రక్క వేషాలు వేసి కళాకారులు ప్రజలను అలరిస్తున్నారు, మంగళవారం మైదుకూరు వాసులైన కొండపల్లి వెంకటరమణయ్య బృందం కళాకారులు తమలాంటి కళాకారులను గుర్తించి స్థలం కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు, సునీల్ హుస్సేన్ కుమార్ ఉమాశంకర్ శివకుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.