కుందుర్పి మండలం మలయనూరులో ఆదివారం ఎమ్మెల్యే సురేంద్రబాబు సుపరిపాలన లో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో లక్ష్మి శంకర్ పై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తులు ఎంపీడీవో లక్ష్మి శంకర్,ఉపాధి హామీ పథకం సిస్టం ఆపరేటర్ శాండిల్ పై ఫిర్యాదు చేశారు.ఎమ్మెల్యే ఇద్దరినీ పిలిపించారు.ప్రజల సమస్యలను ఎందుకు పరిష్కరించడం లేదని ఎంపీడీవో పై ఆగ్రహం వ్యక్తం చేశారు.జాబ్ కార్డుకు డబ్బులు డిమాండ్ చేస్తున్న ఆపరేటర్ పై కూడా ఆగ్రహ వ్యక్తం చేశారు.ఆపరేటర్‌ను కలెక్టర్‌కు చెప్పి సస్పెండ్ చేయిస్తానన్నారు.