కలికిరిలో జరిగిన అండర్-14 ఎస్ జి ఎఫ్ రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ బాల బాలికల విజేతలు చిత్తూరు, క్రిష్ణా జిల్లా
కలికిరి మండలం కలికిరి పట్టణంలోని నల్లారి అమర్నాథ్ రెడ్డి మెమోరియల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ నెల 28నుంచి 30వరకు అండర్-14 ఎస్ జి ఎఫ్ రాష్ట్ర స్థాయి 69వ హ్యాండ్ బాల్ బాల బాలికల పోటీలు జరిగాయి.టోర్నమెంట్ చివరి రోజున ఆదివారం బాయ్స్ విభాగంలో ఫైనల్ మ్యాచ్ చిత్తూరు జిల్లా జట్టు వైజాగ్ జట్టుతో తలపడి 9-6 గోల్స్ తేడాతో చిత్తూరు జిల్లా విజేత గా నిలిచింది.బాలికల విభాగంలో కృష్ణాజిల్లా జట్టు ప్రకాశం జిల్లా జట్టుతో తలపడి 6-3 గోల్స్ తేడాతో కృష్ణా జిల్లా జట్టు విజేతగా నిలిచింది. విజేతలకు కలికిరి అభివృద్ధి కమిటీ చైర్మన్ రెడ్డి వారి యోగేష్ రెడ్డి బహుమతులను ప్రదానం చేశారు