విశాఖపట్నం: జీవీఎంసీ 46వ వార్డులో మెగా పేరెంట్స్ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్
46వ వార్డులో జీవీఎంసీ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో గురువారం ప్రభుత్వం ఏర్పాటు చేసిన మేగా పేరెంట్స్ ఉపాధ్యాయలు ఆత్మీయ సమావేశంలో జీవీఎంసీ డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్ ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు.రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం వలన పిల్లల భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్దే విధంగా ఉంటుందని,విద్యార్థులకు తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మధ్య మంచి తత్సంబంధం ఏర్పడేనందుకు ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందన్నారు.