గిద్దలూరు: బేస్తవారిపేట మండలం చింతలపాలెం అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై ఆటోని ఢీ కొట్టిన లారీ డ్రైవర్‌కి తీవ్ర గాయాలు
ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం చింతలపాలెం సమీపంలోని అమరావతి, అనంతపురం జాతీయ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. లగేజ్ ఆటోను లారీ వెనక నుంచి ఢీ కొట్టిన సంఘటనలో ఆటోడ్రైవర్ దూదేకుల నన్నే సాహెబ్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని కంభ ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం మార్కాపురం తరలించారు. ఆటో లారీని ఓవర్టేక్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. జరిగిన ప్రమాదంపై పోలీసులకు దర్యాప్తు చేస్తున్నారు.