బాల్కొండ: మెండోరా గ్రామంలో వర్షాలు కురావలని వేప కొమ్మలతో జలాభిషేకం నిర్వహించిన మహిళలు
భీమ్ గల్ మండలంలోని మెండోరా లో రైస్ మిల్ వాడకట్టలోని మహిళలు స్వచ్ఛందంగా వర్షాలు కురవాలని ప్రార్థిస్తూ జలాభిషేక కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంతవరకు నామమాత్రపు వర్షపాతం కూడా నమోదు కాలేదు మృగశిర కార్తె పెద్దపుష్యమి కార్తెలు పూర్తి అయిన కూడా వర్షాలు పడకపోవడంతో గ్రామంలో పంటలు, తాగునీటికి సైతం ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి నెలకొంది దీంతో దయానంద రైస్ మిల్ పరిసర ప్రాంతంలో ఉన్న మహిళలు స్వచ్ఛందంగా జలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా గంగమ్మ గుడి ఆవరణలో ఉన్న జలాలను తీసుకువచ్చి వాటికి వేపకొమ్మలతో ప్రత్యేక పూజలు నిర్వహించి వానలు సమృద్ధిగా కురావలని, పంటలు బాగా పండాలని దేవతలకుఅభిషేకం