ఫరూక్ నగర్: షాద్నగర్ పట్టణంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. ఉదయం నుంచి భానుడు తన ప్రతాపాన్ని చూపించగా.. సాయంత్రానికి వాతావరణం చల్లబడి వర్షం కురుస్తుంది. వేసవి తాపానికి అల్లాడిన ప్రజలకు కురుస్తున్న వర్షం ఊరట నిచ్చింది. అయితే అకస్మాత్తుగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుండడంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడ్డారు.