ప్రకాశం జిల్లా మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో దేవాలయ భూములు అన్యక్రాంతం పై నాయకులు నిరసన తెలిపారు. అనంతరం ఇన్చార్జి డి ఎల్ డి ఓ బాలాజీ నాయక్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింహాచలం దేవాలయ భూములు అన్యక్రాంతం కావడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. దేవాలయ భూములకు చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.