సమీపంలోని దట్టమైన నల్లమల్ల అడవి ప్రాంతంలో ఉన్న ఇష్టకామేశ్వరి దర్శనానికి నేటి నుంచి అనుమతి
శ్రీశైలం సమీపంలోని దట్టమైన నల్లమల అరణ్యంలో నెక్కంటి వద్ద కొలువై ఉన్న ఇష్ట కామేశ్వరి అమ్మవారి ఆలయానికి వెళ్ళేందుకు ఫారెస్ట్ అధికారులు భక్తులకు ఈ రోజు నుండి అనుమతి ఇచ్చారు. ఆలయానికి వెళ్ళే రహదారి మరమ్మత్తుల కారణంగా జనవరి 13 నుండి ఆలయం వైపు వెళ్ళకుండా భక్తులను ఆపి వేసారు. రహదారి మరమ్మత్తులు పూర్తి కావడంతో ఇష్ట కామేశ్వరి అమ్మవారి దర్శనానికి వెళ్ళేందుకు భక్తులకు అనుమతి ఇవ్వడంతో వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.