ఎస్కార్ట్ విధుల్లో ఉన్న పోలీసులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా పోలీసులను ఆదేశించారు, తూర్పుగోదావరి జిల్లాలో ఎస్కార్ట్ సమయంలో నిందితులు పారారైన సంఘటన నేపథ్యంలో జిల్లాలో ఎస్కార్ట్ విధులు నిర్వహిస్తున్న ఆర్మ రిజర్వుడ్, లా అండ్ ఆర్డర్ పోలీసులకు జిల్లా ఎస్పీ మంగళవారం కఠిన ఆదేశాలు జారీ చేశారు.