గంగాధర నెల్లూరు: ఈనెల 4వ తేదీ కార్వేటినగరంలో కార్తీక దీపోత్సవం
కార్వేటినగరం రుక్మిణీ, సత్యభామ సమేత శ్రీవేణుగోపాలస్వామి ఆలయంలో ఈనెల 4వ తేదీ కార్తీక దీపోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారి సురేష్ కుమార్ మంగళవారం తెలిపారు. ఉదయం 6నుంచి 6.30 వరకు సుప్రభాత సేవలు, 6.30 నుంచి 8 గంటల వరకు శుద్ధి తోమాల, కొలువు, పంచాంగం, శ్రవణ, అర్చక కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. అనంతరం తిరుమంజనం, సాయంత్రం కార్తీక దీపోత్సవం ఉంటుందన్నారు.