ఆలూరు: ఆలూరులో రూ.30 లక్షల వ్యయంతో చేపట్టనున్న రహదారి అభివృద్ధి పనులకు టిడిపి ఇన్చార్జ్ ఆధ్వర్యంలో భూమి పూజ
Alur, Kurnool | Dec 2, 2025 ఆలూరు మండలం హొలెబిడు గ్రామంలో రూ.30 లక్షల వ్యయంతో చేపట్టనున్న రహదారి అభివృద్ధి పనులకు టీడీపీ ఇన్ఛార్జి వైకుంఠం జ్యోతి మంగళవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రహదారి సమస్య పరిష్కారమైందన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తామని ఆమె హామీ ఇచ్చారు.