భూపాలపల్లి: ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియా అందివ్వాలి : గణపురం మండల రైతులు
భూపాలపల్లి నియోజకవర్గంలోని గణపురం మండల కేంద్రంలోని పిఎసిఎస్ కార్యాలయం ముందు సోమవారం తెల్లవారుజామున యూరియా కోసం రైతులు క్యూ లైన్ లో నిలబడ్డ సంఘటన చోటుచేసుకుంది.ఈసందర్భంగా రైతులు సోమవారం ఉదయం 6 గంటలకు మాట్లాడుతూ తెల్లవారుజాము నుంచి క్యూ లైన్ లో ఉన్నప్పటికీ పిఎసిఎస్ అధికారులు ఇప్పటివరకు యూరియా అందించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని,కొంతమందికే టోకెన్లు జారీ చేసి మిగతా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ,వెంటనే ప్రభుత్వం స్పందించి రైతులకు సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. ఒక్కసారిగా రైతులు కార్యాలయానికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.