భూపాలపల్లి: ప్రతి పౌరుడు స్వచ్ఛభారత్ ఆలోచన కలిగి ఉండాలి : సింగరేణి జిఎం రాజేశ్వర్ రెడ్డి
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి పాఠశాలలో బుధవారం ఉదయం 11 గంటలకు స్వచ్ఛ రహే సేవ కార్యక్రమంలో పాల్గొన్నట్లు జి ఎం రాజేశ్వర్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పౌరుడు స్వచ్ఛభారత్ ఆలోచన కలిగి ఉండాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అప్పుడే ఆరోగ్యంగా ఉండవచ్చన్నారు వ్యక్తిగత శుభ్రత కాకుండా సమాజంలో ఉన్న చెత్తను తొలగించేందుకు ప్రతి పౌరుడు కృషి చేయాలి అన్నారు.సింగరేణి పాఠశాల విద్యార్థిని విద్యార్థులు మరియు అధికారులతో కలిసి పాఠశాల ఆవరణలో వెనుక ఉన్న చెత్తను స్వయంగా తొలగించినట్లు జి ఎం రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.ప్రతి ఒక్కరూ పరిశుభ్రతకు కృషి చేయాలని తెలిపారు.