మఖ్తల్: భూత్పూర్ అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం పట్టివేత
టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులలో మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భూత్పూర్ గ్రామానికి చెందిన వ్యక్తి ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యాన్ని పట్టుకున్న సంఘటన చోటు చేసుకుంది. ఎస్సై భాగ్యలక్ష్మి రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం భూత్పూర్ గ్రామానికి చెందిన చెన్నయ్య గారు ఇంట్లో అక్రమంగా నిలువ ఉంచిన 43.75 లీటర్ల లిక్కర్ పట్టుకున్నట్లు తెలిపారు.