ఉట్నూర్: రుణ మాఫీ చేయాలని అదనపు కలెక్టర్ శ్యామలదేవికి విన్నవించిన ఉట్నూర్ మండలం హాలీగూడ గ్రామస్తులు
రూ.2 లక్షలోపు ఉన్న తమకు ఇంకా రుణమాఫీ కాలేదని ఉట్నూర్ మండలంలోని లక్షేట్టిపేట గ్రామ పంచాయతీ పరిధిలోని హాలీగూడ గ్రామస్థులు సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి తరలివచ్చారు.జిల్లా అదనపు కలెక్టర్ శ్యామలదేవిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఏళ్లుగా పోడు భూములను సాగు చేస్తు జీవనం సాగిస్తున్నామని, ప్రభుత్వం మాకు పట్టాలను అందించడంతో బ్యాంకు రుణాలను తీసుకున్నామన్నారు. తమ రుణాలన్ని రూ.2లక్షలోపు ఉన్నాయని, కానీ రుణమాఫీ జరుగలేదన్నారు.వెంటనే తమకు రుణమాఫీ చేయాలని కోరారు.