మంత్రాలయం: మంత్రాలయంలో యాచకుల కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న శ్రీ గురు రాఘవేంద్ర స్వామి దర్శనానికి వచ్చే భక్తులు
మంత్రాలయం: శ్రీ గురు రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు యాచకుల కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. స్వామివారిని పవిత్రంగా దర్శించుకునేందుకు వెళ్తున్న భక్తులను యాచకులు తాకుతూ వేధిస్తున్నారని భక్తులు తెలిపారు. డబ్బులు ఇచ్చే వరకు యాచకులు వదలడం లేదని భక్తులు తమ బాధను ఆదివారం వ్యక్తం చేశారు. ఈ సమస్యపై సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకుని, యాచకుల బెడదను నివారించాలని భక్తులు కోరుతున్నారు.