గంగాధర నెల్లూరు: కార్వేటినగరం మండలంలోని పుత్తూరు-చిత్తూరు రహదారిపై వాహనాలను నిలపకూడదు : ట్రైనీ ఎస్ఐ రమేష్ నాయక్
కార్వేటినగరం మండలంలోని పుత్తూరు-చిత్తూరు రహదారిపై వాహనాలను నిలపరాదని ట్రైనీ ఎస్ఐ రమేష్ నాయక్ స్పష్టం చేశారు. తన సిబ్బందితో కలిసి బుధవారం తనిఖీలు చేశారు. కార్వేటినగరం బస్టాండ్ కూడలి, రహదారిపై వాహనాలను ఇష్టం వచ్చినట్లు పార్కింగ్ చేయడాన్ని గుర్తించారు. వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.