శ్రీకాకుళం: పార్లమెంట్లో అంబేద్కరుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాపై చర్యలు చేపట్టాలి: సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి
పార్లమెంట్లో రాజ్యాంగ నిర్మాత అంబేద్కరుపై అసహనం కోల్పోయి అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పై చర్యలు చేపట్టాలని శ్రీకాకుళం సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ డిమాండ్ చేశారు. ఈ మేరకు శ్రీకాకుళం అంబేద్కర్ జంక్షన్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేశంలో రాజ్యాంగం స్థానంలో మనువాదాన్ని స్థాపించాలని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నించడం అన్యాయమని తెలిపారు.