వాహనాలపై ప్రమాదకరంగా ప్రయాణించొద్దని రాయదుర్గం ఎస్ఐ గొల్ల శ్రీరామ ప్రసాద్ హెచ్చరించారు. శుక్రవారం రాత్రి అనంతపురం రోడ్డులో నిర్వహించిన తనిఖీల్లో, ఒక లారీ క్యాబిన్ టాప్‌పై 15 మంది కూలీలు ప్రయాణిస్తుండటాన్ని గుర్తించి వాహనాన్ని నిలిపివేశారు. వారిని కిందకు దింపి, ప్రాణాపాయం గురించి కౌన్సిలింగ్ ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ స్పష్టం చేశారు.