కొడంగల్: బురాన్పూర్ గ్రామంలో కల్తీ కల్లు దుకాణాలపై దాడులు నిర్వహించిన ఎక్సైజ్ శాఖ అధికారులు
వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట్ మండలంలోని బురాన్ పూర్ గ్రామంలో శనివారం డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ విజయ్ భాస్కర్ గౌడ్ ఆదేశాల మేరకు కల్తీ కళ్ళు తయారీ దుకాణాలపై దాడులు నిర్వహించారు. కల్తీ కల్లు తయారీకి వాడే ముడి పదార్థాలను తనిఖీ చేశారు. కల్తీ కల్లు తయారీకి వాడే ఆల్ఫ్రజోలం డైజోఫామ్, క్లోరల్ హైడ్రేడ్ వినియోగించడం లేదని నిర్ధారించారు. కల్తీ కల్లుకు నిషేధిత పదార్థాలు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని తయారీదారులకు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వెంకటేశం హెచ్చరించారు.