ఒంగోలు: ఈనెల 28న నెల్లూరులో చంద్రబాబు రా.. కదలిరా బహిరంగ సభను విజయవంతం చేయండి: కావలిలో ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈనెల 28న నెల్లూరు నగరంలో నిర్వహించనున్న రా.. కదలిరా బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ సభను జయప్రదం చేయాలని కావలి నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలతో ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ సమావేశమయ్యారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని పెద్ద ఎత్తున ప్రజలను పాల్గొనేలా చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కావలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి మాలపాటి సుబ్బయ్య నాయుడు పాల్గొన్నారు.