గంగాధర నెల్లూరు: జీడీ నెల్లూరు నియోజకవర్గంలో వైసిపి ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ పూర్తి
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నియోజకవర్గంలో పూర్తి అయినట్టు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ కృపాలక్ష్మి మంగళవారం తెలిపారు. ఇందుకు సహకరించిన 6 మండలాల నాయకులు, ప్రజలకు వారు కృతజ్ఞతలు చెప్పారు. వీటిని డిజిటలైజేషన్ చేసి పార్టీ కార్యాలయానికి పంపనున్నట్టు తెలియజేశారు.